తెలంగాణ ఎన్నికలు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇంత వరకు స్థబ్ధుగా ఉన్న వాతావరణం లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో తెలంగాణలో తాజాగా వినిపిస్తున్న పేరు.. ‘హంగ్’. కారణమేమిటంటే.. లగడపాటి సర్వే.. ప్రతి ఒక్కరి నోటా.. ఇదే మాట.
లగడపాటి సర్వే తెలంగాణలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఎవరా ఇండిపెండెంట్లు? అందరిలోనూ ఇదే ఉత్కంఠ. లగడపాటి లిస్టులో తమ పేరు ఉందా? ఇటు స్వత్రంత్ర అభ్యర్థులతోపాటు.. అటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ సస్పెన్స్. ఇటీవల తెలంగాణ ఎన్నికలు, ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ తనదైన శైలిలో జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ః
ఈ ఎన్నికల్లో.. 8 నుంచి 10మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ.. తొలి రోజున గెలుపు గుర్రాలైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు కూడా ఆయన చెప్పేశారు. అంతేకాదు, మిగిలిన అభ్యర్థుల వివరాలు కూడా రోజుకు ఇద్దరి పేర్లు చొప్పున ప్రకటిస్తానంటూ సంచలన వ్యాఖ్యాలు కూడా చేశారు. అయితే ఆ తరువాత నుంచి మాత్రం లగడపాటి గమ్మున ఉండిపోయారు.
దీంతో అటు అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. మిగిలిన ఆ 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరన్న అంశంపై సర్వత్రా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. లగడపాటి చెప్పిన గెలుపు గుర్రాల జాబితాలో ఒక్క స్వతంత్ర అభ్యర్థులే కాదు.. ప్రజాకూటమి తరుపున సీటు దక్కక రెబల్స్‌గా మారి ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచినవారు..
కొన్నిస్థానాల్లో బీజేపీ సహకారంతో నామినేషన్ వేసి బరిలో నిలిచిన వారు, అలాగే.. అధికార పార్టీ ఆదేశాలను ధిక్కరించి బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులు, ఏళ్ల తరబడి తమ స్వశక్తినే నమ్ముకుని పోటీ చేసిన అభ్యర్థులు.. ఇళా చాలామందే ఉన్నారుగానీ.. అయితే లగడపాటి సర్వే ప్రకారం వీళ్లలో ఈ ఎన్నికల్లో ఢంకా బజాయించే వాళ్లెవరు?
రాజకీయ పార్టీలు, రాజకీయాల్లో తలపండిన సీనియర్ నాయకులు ఎవరికి వారు తమ సొంత అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఇక్కడ మరోో ట్విస్ట్ ఏమిటంటే.. తెలంగాణలో ఈసారి ఏర్పడబోయేది.. ‘హంగ్’ అట.
తెలంగాణ తెరపై బీజేపీ.. హంగ్ వస్తుందనే నమ్మకంతో ముమ్మర ప్రచారం
కేంద్రంలో గొప్ప రాజకీయ విశ్లేషకులు, వ్యూహనిర్ణేతలుగా పేరున్న ప్రధానిమంత్రి మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా తెలంగాణలో హంగ్ వస్తుందనే నమ్మకంతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారని రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది..
అయితే అంతర్గతంగా చెప్పుకునే మాటేమిటంటే.. వారికి హైదరాబాద్ నుంంచి ఉప్పు అంది ఉండాలి..అది కూడా కేంద్రంలో వాళ్లు తీసుకునే విశ్వసనీయ సమాచారం ఎక్కడ నుంచి తీసుకుంటారో..అక్కడ నుంచే వచ్చిందని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా తెలంగాణలో బీజీేపీ సభలకు వచ్చి.. ప్రసంగిస్తుండటంతో .. టీఆర్ఎస్, ప్రజాకూటమి ఆందోళన చెందుతున్నాయి.
ఉన్నమాట చెప్పుకోవాలంటే బీజేపీకి తెలంగాణలో సంఖ్యాబలం లేకపోయినా ప్రజాబలం ఉంది. ప్రజాభిమానం ఉంది. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ తన ఉనికిని చాటుతూనే ఉంది. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవులివ్వడం, అభివృద్ధి చేయడం వల్ల కూడా వారు రేస్ లో నిలిచే ఉన్నారు.
ఇదీ లెక్క..
బీజేపీ 10 నుంచి 12 సీట్లు ఆశించి.. పార్టీ ఏర్పాటు చేయడంలో మద్దతిచ్చి కీలకపాత్ర పోషించాలని చూస్తోంది. ఒకవైపు నుంచి లగడపాటి 8-10 సీట్లు ఇండిపెండెంట్లు గెలుస్తారని ఆయన చెబుతున్నాడు. ఇటు బీజీపీ కూడా గట్టిగానే అంచనా వేస్తోంది. వారు కచ్చితంగా గెలిచే సీట్లు 4వరకు కూడా ఉన్నాయి.
బీజేపీ మద్దతుతో భువనగిరి నియోజకవర్గం నుంచి యువ తెలంగాణ పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డిలాంటి వారు గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలా బీజేపీ చెబుతున్నట్లు 12 కాకపోయినా 10 వచ్చినా లగడపాటి చెప్పినట్టు 10 కాకుండా 8 వచ్చినా వీరిద్దరూ కలిస్తే మొత్తం 18 సీట్లు వస్తాయి..
ఇలా 118 సీట్లలో 18పోతే 100.. టీఆర్ఎస్ లో మంత్రులు, కుటుంబసభ్యులు, ముఖ్యనేతలు ఇలా 35 మంది వరకు గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే ప్రజాకూటమిలో నాలుగు పార్టీలు కలిశాయి..కాబట్టి..వారికి సంస్థాగతంగా పట్టున్న నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. వీరందరి సపోర్ట్ తో వారు ఖచ్చితంగా 35 సీట్లు గెలుస్తారని అంటున్నారు.
పైన చెప్పుకున్నట్టు 100లో 70 పోతే..
మిగిలినవి.. 30..
వీటిలో ఎంఐఎం.. 07
ఆంధ్రా పట్టున్న జంటనగరాలు.. 07
14 పోతే.. ఇక మిగిలినవి అంటే అంచనా వేయలేనివి..16
(బీఎస్ఎఫ్, బీఎల్ ఎఫ్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎన్సీపీ, సీపీఎం వీళ్లు చాలాచోట్ల రేస్ లో ఉన్నారు..త్రిముఖపోరులో గట్టి పోటీ ఇస్తున్నారనేది గమనించాలి.)
(అయితే ఎంఐఎం టీఆర్ఎస్ ఖాతాలోకి వెెళతాయి..అప్పుడు వారి బలం 42 అవుతుంది)..
హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఆంధ్రావాళ్లు కాబట్టి.. వారు ఎవరికైనా స్పష్టమైన మెజార్టీ ఇస్తే మాత్రం.. ఇక్కడ టీఆర్ఎస్ కి ఎంఐఎం కలిసినట్టు ప్రజాకూటమికి ఆంధ్రా ఫోలోవర్స్ ఒక 7 సీట్లు కలిస్తే అప్పుడు మళ్లీ ప్రజాకూటమి కూడా 42 అవుతుంది..ఇలా సమానమయ్యారు.
ఇలా ఎటుచూసినా..ఏ సమీకరణాల్లో చూసినా హోరాహోరీ పోరులాగే కనిపిస్తోంది. ఓటరు కూడా తెలివి మీరిపోయాడు.. తెలంగాణ ఓటరు చైతన్యవంతమయ్యాడు.. ప్రజాభివృద్ధి చేసినవారినే గెలిపించేలా ఉన్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసే ముచ్చటే లేదు. మిగిలింది ఇండిపెండెంట్లను తనవైపు తిప్పుకోవాలి. లేదా బీజేపీతో రాజీ పడాలి..ఇలా చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఒడ్డున పడుతుంది.
లేదంటే అందరూ హేమాహేమీలు, రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన చంద్రబాబునాయుడు చక్రం తిప్పి.. ఇండిపెండెంట్లను అటు లాగితే.. బీజేపీ సపోర్ట్ టీఆర్ఎస్ వైపు వెళితే.. మళ్లీ రెండువైపులా తక్కెట సమానమైపోతుంది. అప్పడు పరిస్థితి రసవత్తరంగా మారుతుంది.
బహుశా ఈ సమీకరణాలన్నీ చూసే కాబోలు.. లగడపాటి హంగ్, బేజీపీ హంగ్ అని తెగ పాటలు పాడుతున్నాయి. లగడపాటి ముసిముసినవ్వుల వెనుక మర్మం అదై ఉండాలి.
ఎందుకీ పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టింది..
1.అందరూ తక్కువగా అంచనావేస్తున్న బహుజనపార్టీ కూడా కొన్నిచోట్ల బాగానే ఉందంటున్నారు. వీళ్లు గెలవకపోయినా ఓట్లు చీల్చే అవకాశం ఉంది.
2. అధికారపార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత, రెండు టీఆర్ఎస్, కేసీఆర్ వీరిపై అభిమానం ఉంది కానీ..కొందరు అభ్యర్థులపై లేదు..ఇది కూడా వ్యతిరేక పవనాలు వీచేలా ఉంది.
3. మరొక ముఖ్యమైన అంశం ఇప్పుడు ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు పెడుతున్నారు. ఇంతకుముందు అభ్యర్థితో సంబంధం లేకుండా ‘కారు’ పై వేసి వెళ్లిపోయేవారు.ఇప్పుడా పరిస్థితి లేదు..అభ్యర్థి ముఖం చూసి చిరాకుపడి వేరే వాళ్లకు వేసేసినా ఆశ్చర్యపోనవసం లేదు
4. ఈవీఎంలపై ఫొటోలు ఇండిపెండెంట్ల అభ్యర్థులకు వరంలా మారే అవకాశాలున్నాయి. ఇంతకుముందు బలమైన ప్రజాభిమానం ఉన్నవాళ్లు కూడా గుర్తుల వల్ల ఓటర్లు ఇబ్బందులు పడటం, ఎంపీ, ఎమ్మ్యేల ఎన్నికల్లో ఎంపీకి వేయాల్సింది.. ఎమ్మెల్యేకి.. వారికేయాల్సింది..వీరికి ఇలా వేసి అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలున్నాయి.
ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక అభ్యర్థి గుర్తుతో సంబంధం లేదు. వీడు మనోడా కాదా.. వీడిది తెలిసిన ముఖమేనా? వీడు ఐదేళ్లుగా మన చుట్టూ తిరుగుతున్నాడా లేదా? లేకుండా ఎన్నికలప్పుడే డబ్బు కట్టలతో వస్తున్నాడా? ఇన్ని అంశాలు ఈవీఎంలపై ఫొటోలతో ప్రభావితం చేయనున్నాయి.
ఇది కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థులకు మేలు చేస్తుంది. ఇక ఓటు వేయడంలో ఎలాంటి పొరపాట్లకు తావుండదు.
ఒకప్పడది..ఇప్పుడా పప్పులుడకవు
ఇందిరమ్మ, హస్తం గుర్తు అంటూ.. వీటితోటే కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థులతో సంబంధం లేకుండా.. పబ్బం గడిపేసుకుంది. ఎన్నోసార్లు రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకుంది. తెలుగుదేశం కూడా పార్టీ పెట్టినప్పుడు అందరినీ కొత్తగా తీసుకువచ్చారు. ఎవరికెవరూ తెలీదు. కేవలం ఎన్టీవోడు, సైకిలు గుర్తు అంతే గుద్ది వదిలేశారు.
ఇప్పుడా పప్పులు ఉడకవు..ఎవరో తెలియని అనామకుడిని తీసుకువచ్చి ఓటేయమంటే.. ఇప్పుడు ఓటర్లు వేయరు. పార్టీపై అభిమానం ఉంటే ఉండనీ.. కానీ అభ్యర్థి కూడా నచ్చినవాడై ఉండాలి. రెండోది ఇండిపెండెంట్లపై అభిమానం ఉన్న వారి గుర్తులు సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోవడం ఒకప్పుడు మైనస్ గా ఉండేది.. ఇప్పుడు వారి ఫొటోలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి.. కొందరు తమకి నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంది.
లగడపాటి చెప్పే ఇండిపెండెంట్లు గెలవడమే కాదు..ఇంకేం చేస్తారంటే..
కొందరు తమ గ్రామాలు, ఊళ్లు, సామాజికవర్గాల నుంచి కొంతవరకు ఓట్లను చీల్చగల సామర్థ్యం ఉంటుంది. ఇవి ప్రధానపార్టీలపై ప్రభావం చూపిస్తాయి. మరొకటి అలాగే ఇండిపెండెంట్ల అభ్యర్థులకు కొన్నిచోట్ల ఓటు బ్యాంకు వారిది వారికే ఉంటుంది. ఇక్కడ పార్టీల ప్రభావం పనిచేయదు..
స్పష్టమైన ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు వారే.. ఇప్పుడు మారిన త్రిముఖపోరులో వారు చక్కగా బయటపడే అవకాశాలున్నాయి. ఎందుకంటే ద్విముఖ పోరులో అయితే ఇండిపెండెంట్ బలం సరిపోకపోవచ్చు.. ఇప్పడు రేస్ లో ప్రజాకూటమి కూడా వచ్చి చేరింది. దీంతో టీఆర్ఎస్, ప్రజాకూటమి మధ్యలోనే కాదు.. బీజేపీ, ఇండిపెండెంట్లు ఇలా త్రిముఖ, బహుముఖ పోటీలు కూడా ఉన్నాయి.
త్రిముఖ పోరులో ఓట్లు ఎలా చీలిపోతాయో చూడండి
ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. ఒక నియోజకవర్గంలో సుమారు ఓటింగు 1,60,000 వరకు ఉంటోందనుకుందాం. గత రెండు ఎన్నికల్లో మొదటిసారి.. 2009లో టీఆర్ ఎస్, టీడీపీ సపోర్ట్ తో ఒక అభ్యర్థి విజయం సాధించారనుకుందాం. అప్పడు సమీప ఇండిపెండెంట్ అభ్యర్థికి 44 వేల ఓట్లు వచ్చాయి. స్వల్పతేడాతో అపజయం పాలయ్యారు.
అప్పుడు వీరిద్దరికి లక్ష ఓట్లు పోను.. మిగిలిన 60వేలు వివిధ పార్టీలకు వెళ్లిపోయాయి. అంటే వీరికి రానివి 60వేలు ఉన్నట్టే లెక్క.. అదే 2014 లో విజయానికి ఇద్దరే ప్రత్యర్థులుంటే అప్పుడు స్వతంత్ర అభ్యర్థి స్వల్ప తేడాతో మళ్లీ డిపోయారు. కానీ అతనికి ఆ 44వేలు ఏవైతే ఉన్నాయో ఆ ఓటు బ్యాంకు అలాగే ఉంది.
ఇదే ఇక్కడ పాఠకులందరూ గమనించాలి. లగడపాటి కూడా అదే చెబుతున్నాడు. ఇండిపెండెంట్ల ఓట్లు చెదిరిపోవు. అవి స్థిరంగా ఉంటాయి.
ఇప్పుడు త్రిముఖ పోరు వచ్చింది. అంటే ముగ్గురు బరిలో ఉన్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థి గెలవడానికి కావల్సిన ఓటు బ్యాంకు 50 వేలు ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిక్స్ డ్ 44 వేలు ఉన్నాయి.
ఇంతకుముందు చెప్పుకున్నట్టు మిగిలిన 60వేల ఓట్లలో కొన్ని కాంగ్రెస్ వి, కొన్ని బీజేపీవి, కొన్ని కమ్యూనిస్టులవి, కొన్ని బహుజన సమాజ్ వాదీ పార్టీవి..కొన్ని ఇతరులవి.. ఇప్పుడు ప్రజాకూటమి రేస్ లోకి వచ్చింది కాబట్టి..ఇంతకుముందు చెప్పినట్టు హస్తం గుర్తు, ఇందిరమ్మ ఈ మైండ్ సెట్ తో వారికి 20వేలు ఓటు బ్యాంకు ఉంటుంది.అలాగే ప్రజాకూటమి చిల్లర కొట్టు పార్టీల ఓట్లన్నీ కలిపి 30వేలు అవుతున్నాయనుకుందాం.
ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థిపై వ్యతిరేకతే కాదు.. ప్రజా కూటమిలో కోదండరామ్ లాంటివాళ్లు టీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నారు. ఆయనపై అభిమానం ఉన్నవాళ్లు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఇలా వీరందరూ బయటకు వస్తే ఒక 10వేల ఓట్లు.. ప్రజాకూటమికి డైవర్ట్బీ అయి.. అతనికి ఉన్న 50 వేల నుంచి తీసేస్తే అతను 40 వేలుకి వస్తాడు.
ఇప్పుడు ప్రజాకూటమి కూడా 40 వేలు అవుతుంది. అక్కడ ఇండిపెండెంట్ 44 వేలులో ఉన్నాడు. (ఇతనిది ప్రజాభిమానం.. ఇది మారదు)..త్రిముఖపోరులో రొట్టె కోసం కొట్టుకున్న పిల్లి, కోతి కథలా.. ఇద్దరూ తీసుకెళ్లి ఇండిపెండెంట్లను గెలిపించే అవకాశాలున్నాయి. ఇదే లగడపాటి సర్వే చిదంబర రహస్యం అయి ఉండవచ్చు.. అందుకే అతను ముసిముసి నవ్వులు అలా నవ్వుతున్నాడు
అంతేకాదు ఓటరు మారాడు.. డబ్బులు ఖర్చు పెడితే పని కాదు..
ఏ ఓటరునడిగినా ఏ నాయకుడొచ్చినా అంతే.. మా బతుకులేం మారవనే అంటున్నారు. అందుకే 71 ఏళ్లుగా చూసి చూసి ఈ మాయమాటల రాజకీయనేతలను చూసి మోసపోయారు. ఇప్పడు మేం మోసపోం.. మాకు మాయచేయడం తెలుసు.. డబ్బులిచ్చినోడి దగ్గర డబ్బులు తీసుకుంటాం.. ఓటేసేటప్పుడు అప్పుడు చూస్తాం..
అవన్నీ పాతరోజులు.. అమ్మోరిమీద ఒట్లు, కులపెద్దల మీద ఒట్లు..ఈ కథలన్నీ అప్పుడు..ఇప్పుడవేం లేవు అంటున్నారు. ఎవరరు తీసుకున్న గోతిలో వారే పడటమంటే అదే…
లగడపాటి చెప్పే ఇండిపెండెంట్లు వీరే అయ్యుండొచ్చు…
1. నారాయణ్ పేట్ 2. బోథ్ (ఈ రెండూ లగడపాటి చెప్పారు).. వీరై ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు..రాజకీయ పండితులు 3. వికారాబాద్ 4. తుంగతుర్తి 5. భద్రాచలం 6. వైరా 7. చెన్నూరు 8. కొత్తగూడెం 9. మధిర 10. ఖైరతాబాద్ 11. జూబ్లీహిల్స్
బీజేపీ ఆశిస్తున్న 10 – 12 సీట్లు ఇవే కావచ్చు…
1. ఆదిలాబాద్ అర్బన్ 2. నిజామాబాద్ అర్బన్ 3. కరీంనగర్ అర్బన్ 4. భువనగిరి ( బీజేపీ సపోర్ట్ తో నిలిచిన యువతెలంగాణ పార్టీ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి) 5. నిర్మల్ 6. కామారెడ్డి 7. భూపాలపల్లి 8. సూర్యాపేట 9. జుక్కల్ 10. చొప్పదండి 11. హుస్నా బాద్ 12. ఆందోల్ 13. మల్కాజ్ గిరి 14. ఉప్పల్ 15. శేరిలింగంపల్లి 16. ముషీరాబాద్
inta goppa vishleshana bharata desha ennikala raajakeeyallo e potugadu kuda chesi undadu. eeyanagaariki anukoolamaina dani kosam addagolu logiclu vetiki mari techchi pettadu. pratipakshala vaallu kuda intha verribagulodiga vishleshana cheyaru