చైతన్యం: నోటితో కాదు.. రూ.100 బాండ్ పేపర్‌పై హామీ కావాలన్న గ్రామస్తులు.. పరారైన ఎమ్మెల్యే అభ్యర్థి!

nagireddypally-bondpaper-mla-candidate-sign-1
- Advertisement -

జనగామ: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. అంతేకాదు, జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరుపున పోటీలో నిలిచిన తాజా మాజీ ఎమ్మెల్యేకు ఎన్నికల ప్రచారంలో ఓ గ్రామ ప్రజలు ఇచ్చిన షాక్‌గా కూడా దీనిని చెప్పుకోవచ్చు.

అసలేం జరిగిందంటే.. భాగంగా జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డి‌పల్లి గ్రామానికి వెళ్లారు. ఓట్లు అభ్యర్థిస్తున్న ఆయన్ని గ్రామస్తులు అడ్డుకుని తమ గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వమని అడిగారు.

వాళ్లు అడిగింది కూడా.. ఓ చెరువు నిర్మాణం, నాగిరెడ్డిపల్లి-కొన్నె బీటీ రోడ్డు నిర్మాణం, మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి విరాళం కావాలని. గ్రామస్తులు చెప్పింది వినగానే ‘ఓస్.. ఇంతేనా’ అనుకున్న యాదగిరి రెడ్డి ఆ మేరకు హామీ కూడా ఇచ్చేశారు.

రూ.100 బాండ్ పేపర్‌పై హామీ కావాలంటూ…

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. ఎమ్మెల్యే అభ్యర్థి నోటితో హామీ ఇస్తే కుదరదని, గెలిచిన మూడు నెలల్లోగా ఆయా అభివృద్ధి పనులు తప్పక చేస్తానంటూ తమకు రూ.100 బాండ్ పేపర్‌పై హామీ కావాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి షాక్ తిన్నారు.

ఈలోపే ఎవరో ఆ మేరకు రూ.100 బాండ్ పేపర్ కూడా తయారు చేయించి పట్టుకొచ్చేశారు. ఇంకేముంది.. అభ్యర్థి పని కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. గ్రామస్తుల తీరుకు విస్మయపడిన ఆయన మెల్లగా అక్కడ్నించి జారుకున్నారు తప్పితే ఆ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి వారికి హామీ ఇవ్వలేకపోయారు.

 

 

- Advertisement -