
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలపై తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్థినులపై హత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన సైకో శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే.
చదవండి: అప్పుడు అలా అనిపించింది.. అందుకే చంపేశా: సైకో కిల్లర్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు….
అయితే ఈ దీక్షా శిబిరం ఫొటోను మల్యాల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ శనివారం రాత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇక దీనికి స్పందించిన కేటీఆర్ ఆదివారం.. సర్పంచ్ శ్రీనివాస్‌కి ఫోన్ చేశారు.
హాజీపూర్‌లో దారుణ ఘటనలపై విచారం వ్యక్తం చేసిన కేటీఆర్… బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హాజీపూర్‌లో ఘటనలు చాలా బాధాకరమని, దీనిపై సీఎం కేసీఆర్ చాలా బాధపడుతున్నారని కేటీఆర్ సర్పంచ్‌తో చెప్పారు.
ఇక ఇటువంటి ఘటనలపై ఎంత కఠినంగా వ్యవహరించాలో అంత కఠినంగా వ్యవహరిస్తామని, మరోసారి ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హాజీపూర్‌ను సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు.








