26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణలో బీజేపీ గెలిచే సీటు అదేనా….!

తెలంగాణలో బీజేపీ గెలిచే సీటు అదేనా….!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని 17 స్థానాలకి ఏప్రిల్11న జరిగిన లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేశాయి. కొన్ని సర్వేలు టీఆర్ఎస్ 16 స్థానాలు ఎం‌ఐ‌ఎం ఒక స్థానం గెలుచుకుంటుందని చెప్పగా…మరి కొన్ని 12-15 స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి.

అదే సమయంలో కాంగ్రెస్ 1-2 స్థానాలు గెలుస్తుందని, బీజేపీ కూడా 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వేలు తేల్చాయి. దీంతో బీజేపీ గెలవబోయే ఆ ఒక్క సీటు ఏదన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధుల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌లు బలమైన అభ్యర్ధులు. వీరిలో కిషన్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు.

అలాగే కరీంనగర్‌లో బండి విజయ్ కూడా గట్టి పోటీ ఇచ్చారని తెలుస్తోంది. చూడాలి మరి 23న వెలువడయ్యే అసలు ఫలితాల్లో బీజేపీ అభ్యర్ధులు ఏ మేర విజయం సాధిస్తారో.

చదవండిఎగ్జిట్ పోల్స్: తెలంగాణలో కారు జోరు…
- Advertisement -