హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం ఏపీ ఎన్నికలకీ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అయితే అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకే పట్టం కట్టలేదు. కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా వస్తే.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా వచ్చాయి.
దీంతో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అసలు ఫలితాలు వచ్చేవరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు.
చదవండి: ఎగ్జిట్ పోల్స్ విఫలం! ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
తన వరకు అయితే ఇలాంటి సర్వేలను నమ్మనని, కానీ ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచవని ధీమా వ్యక్తం చేశారు.
కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అని చంద్రబాబును గెలిపిస్తే ఆయన ప్రజలకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. అందుకే ప్రజలు ఇప్పుడు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు.








