హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి, దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగిన 19 మందితోపాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 5 మంది నేతలపై.. మొత్తం 24 మందిపై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. వీరందరినీ 6 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగానే కాకుండా, ప్రజాకూటమి అభ్యర్థులు నిలబడిన చోట కూడా వారికి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేతలను కూడా పార్టీ నుంచి బహిష్కరించామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
బహిష్కరణకు గురైన నేతల వివరాలు…
1. శివకుమార్ రెడ్డి – నారాయణ్ పేట్
2. శ్రీ గణేశ్ – కంటోన్మెంట్
3. ఇబ్రహీం -మహబూబ్ నగర్
4. సురేందర్ రెడ్డి -మహబూబ్ నగర్
5. బిల్యానాయక్ – దేవరకొండ
6. పాల్వాయి శ్రావణ్ కుమార్ రెడ్డి – మునుగోడు
7. డాక్టర్ రవికుమార్ – తుంగతుర్తి
8. నెహ్రూ నాయక్ – డోర్నకల్
9. అబ్బయ్య – ఇల్లందు
10. బాలరాజ్ నాయక్ – ఇల్లందు
11. ఎడవల్లి కృష్ణ – కొత్తగూడెం
12. అరుణతార – జుక్కల్
13. రత్నాకర్ – నిజామాబాద్
14. రవి శ్రీనివాస్- సిర్పూర్ కాగజ్ నగర్
15. బోడ జనార్దన్ – చెన్నూరు
16. హరి నాయక్ – ఖానాపూర్
17. అనిల్ జాదవ్- బోథ్
18. నారాయణరావు పటేల్ – ముథోల్
19. రాములు నాయక్ – వైరా