‘సమరసత సేవా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో.. నేడు హిందూ భజన బృందాల సమ్మేళనం

banner
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానాలు, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో తితిదే ఆర్థిక సహకారంతో హిందూ ధర్మ పరిరక్షన ట్రస్ట్ పర్యవేక్షణలో..తూర్పుగోదావరి జిల్లాలోని షెడ్యూల్ కులాలు, గిరిజనులు, గంగపుత్రులు నివసిస్తున్న ప్రాంతాల్లో హిందువులలో జాగృతిని పెంపొందించడానికి విరివిగా దేవాలయాల నిర్మాణం జరిగింది. వీటి కేంద్రంగా భజన, సామూహిక హారతి, పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కలియుగంలో భగవంతుని దయ త్వరగా పొందాలన్నా, ఈ ఒత్తిడితో కూడిన పరుగుప్రపంచంలో కాసింత ఉపశమనం కావాలంటే.. అందరూ ఆచరించాల్సిన సాధనం.. కేవలం భజన, స్వామివారి నామస్మరణ మాత్రమే.. అందుకనే భజన గురువుల మార్గదర్శనంలో ప్రతి హిందువులో చైతన్యం పెంపొందించేందుకు మండల స్థాయిలో భజన బృందాల సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ప్రతి మండలంలోఉన్న భజన గురువులు, భజన బృందాలె, పారాయణ బృందాలు, గురుస్వాములు, భక్తులు అందరూ ఆదివారం (25 -11-18) తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. యావన్మంది భక్తులు తరలి రావల్సిందిగా సమరసత సేవా ఫౌండేషన్ నిర్వాహకులు కోరుతున్నారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయ చైర్మన్ కంటే బాబు, కమిటీ సభ్యులు, సామర్లకోట మున్సిపల్ చైర్మన్  మన్యం పద్మావతి చంద్రరావు ముఖ్య అతిథులుగా, ఎస్ఎస్ ఎఫ్ కార్వనిర్వాహక సభ్యులు కె.సునీల్ కుమార్, సీఏ, గూడురు, సాదు ప్రసాద్ పరేణ్యం, నండూరి కృష్ణమూర్తి  ప్రముఖులు పాల్గొననున్నారు. సమరసత సేవా సమితి మండల కన్వీనర్ కట్టా రాంబాబు, గంధం వెంకటలక్ష్మి, పటాని వెంకట్రావు, కొండపల్లి సత్యనారాయణమ్మ, మండల ధర్మ ప్రచారక్ అమలకంటి చంటిబాబు, కాపుగంటి పైడిరత్నం తదితరులు, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరగనున్నది.

ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథాలు.. భక్తుల కోసం 50శాతం తగ్గింపు ధరల్లో …

శ్రీకృష్ణ భగవానుడు.. మొట్టమొదట అర్జునుడికి ఉపదేశించిన వ్యక్తి త్వ వికాస గ్రంథం.. భగవద్గీత.. కురుక్షేత్రంలో ధనుర్భాణాలు విడిచి యుద్ధం చేయనని చెప్పిన అర్జునుడిలో మనోధైర్యాన్ని నింపి, కార్యోన్ముఖుడిని చేసిన భగవంతుడు ఉపదేశించిన పరమ పవిత్రమైన గ్రంథం భగవద్గీత.. అది నేటితరానికి దూరమైపోతుండటంతో వాటిలో సంక్లిష్టతను తొలగించి… రచయిత శ్రీనివాస్ మిర్తిపాటి రాసిన గుణ (భగవద్గీత).. పుస్తకం నేడు మీకు అందుబాటులో ఉంది. ఇంకా మనిషి అనేవాడు ఎలా ఉండాలో ఒక 16 క్వాలిటీలతో డిజైన్ చేసి.. మానవ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన శ్రీరాముడి సుగుణాలపై ‘జైత్రయాత్ర’ రాశారు.

యువతకు, నేటి తరానికి, ప్రజలకు అత్యంత సులువుగా, సరళంగా, పత్రికా భాషలో సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా వ్యక్తిత్వ వికాసాన్ని మేళవించి, హిమాలయాలకు వరకు వెళ్లి వచ్చి రాసిన ఆధునికత నిండిన  ఆధ్యాత్మిక గ్రంథాలు.. అమేజాన్ లో శ్రీనివాస్ మిర్తిపాటి అని టైప్ చేస్తే వస్తాయి. ఇంకా మీకు కావాలంటే.. 868655 9557 నంబరుకు ఫోను చేస్తే పంపించగలరు. స్వయంగా కావల్సినవారు.. పుస్తకం ధరలో 50 శాతం తగ్గించి ఇచ్చేందుకు పబ్లిషర్స్ ఒప్పుకున్నారని రచయిత మిర్తిపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కింది స్లగ్ టైప్ చేసినా అమెజాన్ యాప్ లో కనిపిస్తాయి.

.https://www.amazon.in/s/ref=dp_byline_sr_book_1?ie=UTF8&field-author=Srinivas+Mirthipati&search-alias=stripbooks

Jythrayatra Title1

- Advertisement -