హైదరాబాద్ : గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు తన గొయ్యి తానే తవ్వుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ రద్దైన అంశంపై ఉత్తమ్ స్పందించారు.
మీడియాతో మాట్లాడుతూ.. నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని, తాము క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఇక కేసీఆర్ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇంతకుమించి ఏమీ తాను మాట్లాడనని, తర్వాత అన్ని విషయాలపై క్లియర్ గా మాట్లాడతానని చెప్పారు.