మాకు అన్ని పార్టీలూ సమానమే, రేవంత్ రెడ్డి అరెస్టు ఎందుకంటే..: క్లారిటీ ఇచ్చిన రజత్ కుమార్!

Rajath-Kumar-Election-Commissioner
- Advertisement -

Rajath-Kumar-Election-Commissioner

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అరెస్టు విషయమై తెలంగాణ ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటం వల్లే రేవంత్ రెడ్డి అరెస్టుకు అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి జొరబడి ఆయనతోపాటు ఆయన సోదరులను, గన్‌మెన్లను తమతోపాటు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలపాలంటూ ఆయన భార్య గీత అధికారులను ప్రశ్నించారు. కానీ పోలీసులెవరూ ఈ విషయమై నోరు మెదపడం లేదు.

మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల సంఘంపై, పోలీసులపై, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో తెలంగాణ ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు.

అందుకే రేవంత్ అరెస్ట్…

కొడంగల్‌లోని కోస్గీలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ హెచ్చరిక చేయడంతో టీఆర్ఎస్ నేతలు తమకు ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని రజత్ కుమార్ వివరించారు. కేంద్ర స్థాయిలో వచ్చిన ఆదేశాలతోనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి తాను ఉత్తర్వులు జారీ చేశానని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసినట్లుగా తాము ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ అలాంటి పని చేయదని, తమకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని విధాలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

 

 

- Advertisement -

1 COMMENT

  1. దొంగనాకొడుకులు …శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఉంటే , ఆ అనుమానాలు ఉంటే చేసే ఉజ్జోగాలు తిన్నగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి .అధికారం ఉన్నోడు ఆదేశాలు ఇస్తే ఊపుకుంటూ వెళ్లిపోవడమేనా ?