హైదరాబాద్: ఇటీవల వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో 3,82,116 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అయితే ఫలితాలపై వేలాది మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఇంటర్ ఫెయిల్ అయ్యమని కొందరు విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్నారు.
దీంతో దిగోచ్చిన ప్రభుత్వం రీకౌంటింగ్, రీవెరికేషన్‌కు అవకాశం కల్పించింది. వీరిలో 92,429 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను రీవెరిఫికేషన్ చేయించారు. మరికొందరి ఆన్సర్ షీట్లకు రీకౌంటింగ్ నిర్వహించారు.
ఆ ఫలితాలను తెలంగాణ బోర్డు సోమవారం రాత్రి వెల్లడించింది. ఇందులో గతంలో ఫెయిలైన విద్యార్థుల్లో 1,137 మంది రీవెరిఫికేషన్ తర్వాత ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో వారిలో 585 మంది ఫస్టియర్, 552 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. పాసైన విద్యార్థుల వివరాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఇక ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తయిందని, 19,788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని త్వరలోనే అప్ లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.








