21.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ జగన్‌కు భారీ బందోబస్తు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్.. ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభ్వుతం…

జగన్‌కు భారీ బందోబస్తు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్.. ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభ్వుతం…

telangana government provides bullet proof vehicle for ys jagan
- Advertisement -

telangana government provides bullet proof vehicle for ys jagan

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో ఇటీవల ఆయనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఈ తరహా భద్రతను కల్పించినట్లు తెలుస్తోంది.

భద్రతలో భాగంగా వైఎస్ జగన్‌కు బుల్లెట్ ప్రూప్ వెహికల్‌‌ను తెలంగాణ  ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఆయన ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై దాడి అనంతరం.. జగన్ అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని నేరుగా హైదరాబాద్‌కు వచ్చేశారు. అనంతరం ఇక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

గాయం మానడానికి మరికొద్దిరోజుల సమయం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు వైఎస్ జగన్ తన పాదయాత్రను తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు.  ప్రస్తుతం జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

- Advertisement -