పోలవరం ప్రాజెక్టు రోడ్డు.. సొగసు చూసొద్దాం రండి!

polavaram-project-road-2
- Advertisement -

come-on-visit-the-polavaram-project-on-this-beautiful-road

రాజమహేంద్రవరం:  ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. వచ్చే ఎన్నికలలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే ఎన్నో ఆటంకాలను సైతం అధిగమించి.. వారి నుంచి వచ్చే నిధుల కోసం ఎదురుచూడకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏదో అవస్థలు పడుతున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టును తిలకించేందుకు ప్రజలకు కూడా అవకాశం కూడా కల్పించారు. అంతేకాదు, ప్రాజెక్టును వీక్షించడానికి వచ్చే పర్యాటకులకు అక్కడే భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.

అంతా బాగానే ఉందిగానీ.. ప్రాజెక్టుకి వెళ్ళే రహదారి చూస్తే మాత్రం ..కళ్లు తిరిగి కిందపడక మానరు. ఎందుకంటే ఏ తుపానో, భూకంపమో వస్తే ఎలా ఉంటుందో.. అలా రహదారి బీటలువారిపోయి.. రోడ్డంతా అట్టులా లేచిపోయి బీభత్సంగా కనిపిస్తోంది. ఇప్పుడు దీనిపై నుంచి ప్రాజెక్టుకి వెళ్లాలంటే .. ఎలా అని.. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేస్తున్నదంతా ’ఉత్త భజనేనా?’

ఇప్పుడీ రహదారుల ఫొటోలు చూసి చెప్పండి..అంటే ఇంతవరకు అధికారులు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై చేస్తున్నదంతా భజనేనా అనే అనుమానాలు రాకమానవు. ఇక్కడందరూ  ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే..ప్రాజెక్టుకి వెళ్లే భారీ వాహనాలన్నీ ఈ రహదారిపై నుంచే వెళుతుంటాయి. వాటికేదైనా ప్రమాదం జరిగితే కోట్ల రూపాయల ఖరీదైన వాహనాలు..పాడైపోతాయని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు.

ఈ అతుకుల, గతుకుల రోడ్లను చూసి.. చూపించాల్సింది ప్రాజెక్టు ఒక్కటే కాదు.. లెక్కలు కూడా చెప్పాలని అంటున్నారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్టు..అసలేం జరుగుతోంది..పోలవరం ప్రాజెక్టు దగ్గర అనే విషయాలను బహిర్గతం చేయాలని అంటున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎప్పటిలాగే మాత్రం శ్వేతపత్రం ప్రకటిస్తానని అంటున్నారు.

రోడ్డే ఇలా ఉందంటే..

ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు..ఇలాగే పుష్కరాల్లోగా రాజమహేంద్రవరం గోదావరిపై నిర్మించిన నాలుగో వంతెన..( గామన్ బ్రిడ్జి) ప్రారంభించాలని ఒత్తిడి చేయడంతో వాళ్లు అరాకొరా పనులతో పూర్తి చేసి..మమ అనిపించారు. ఇప్పుడా బ్రిడ్జి చూస్తే  గుండె తరుక్కుపోక మానదు.

కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చూస్తే రెండేళ్లు కాకుండానే పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు కూడా ఎలాగైనా ఎన్నికలలోపు పూర్తి చేయాలని హడావుడిగా నిర్మిస్తున్నారు.

అంతేకాకుండా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు కూడా ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుందని.. ఇంకో పదేళ్లయినా కావాలని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం మెయిన్ ప్రాజెక్టు కట్టి గ్రావిటీ మీద నీళ్లిస్తారని అంటున్నారు. అది ప్రమాదకరమని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.

ఈ రోడ్డు చూస్తే ఏమనిపిస్తుంది..అక్కడ హడావుడి చేసి గోదావరిపై  కట్టిన నాలుగో బ్రిడ్జి సంగతి చూస్తే.. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇంకా ప్రతిపక్షనేతలు అందరూ కోరుతున్నారు. రేపు ఎన్నికలకి ప్రజల ముందు పోలవరం ప్రాజెక్టు భజన  తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పోలవరం ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయవద్దని మరికొందరు కోరుతున్నారు.

come-on-visit-the-polavaram-project-on-this-beautiful-road

 

- Advertisement -