న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో నేటి(సోమవారం)తో నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలతో తెలంగాణలో రోడ్ షోలు నిర్వహిస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలోని నేతలు పలు దఫాల్లో, పలు ప్రాంతాల్లో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపింది.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ, మాజీ స్పీకర్ మీరా కుమార్, టీమిండియా మాజీ సారథి అజరుద్దీన్‌లతో పాటు పలువురు సీనియర్ నాయకుల(ముఖ్యంగా కన్నడిగులు)కు చోటు కల్పించారు.
ఇక… రాష్ట్ర నాయకుల్లో సనత్‌నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ మర్రి శశిధర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాములు నాయక్, కె. జానారెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార రంగంలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా…
- రాహుల్ గాంధీ
- సోనియా గాంధీ
- మన్మోహన్ సింగ్
- గులాం నబీ ఆజాద్
- మల్లికార్జున ఖర్గే
- వి. నారాయణసామి
- అశోక్ చవాన్
- జి. పరమేశ్వర
- మీరా కుమార్
- డీకే శివకుమార్
- మహ్మద్ అజారుద్దీన్
- విజయ శాంతి
- సల్మాన్ ఖుర్షీద్
- జ్యోతిరాదిత్య సింధియా
- జైపాల్ రెడ్డి
- ఆర్‌సీ కుంతియా
- శ్రీనివాసన్ కృష్ణన్
- సలీం అహ్మద్
- బీఎస్ బోసురాజు
- మర్రి శశిధర్ రెడ్డి
- మధుయాష్కీ గౌడ్
- దామోదర రాజనర్సింహ
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- రాములు నాయక్
- కె. జానారెడ్డి
- మహ్మద్ షబ్బీర్ అలీ
- రేవంత్‌రెడ్డి
- మల్లు భట్టివిక్రమార్క
- పి. సుధాకర్ రెడ్డి
- రేణుకా చౌదరి
- డీకే అరుణ
- వి. హన్మంతరావు
- రాజ్ బబ్బర్
- నదీం జావేద్
- నగ్మా మెరార్జీ
- ఖుష్బూ
- నేరెళ్ల శారద
- జైరాం రమేశ్
- అనిల్ థామస్
- నితిన్ రౌత్