22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్.. ఎలాంటి సడలింపులు లేవు: సీఎం కేసీఆర్

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్.. ఎలాంటి సడలింపులు లేవు: సీఎం కేసీఆర్

cm-kcr-press-meet-on-lockdown
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. 

చదవండి: హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఒక్క మహిళ నుంచి 80 మందికి కరోనా..!

1897 ఎపిడమిక్ డిజాస్టర్ నిర్వహణ చట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంటాయని అన్నారు.

దాని ప్రకారమే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అంచనా వేసి, లాక్‌డౌన్ పొడిగిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్ మే 3తో ముగియనుండగా.. తెలంగాణలో మాత్రం లాక్‌డౌన్ మే 7వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.

లాక్‌డౌన్ కాలంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీని రాష్ట్రంలో నిషేధిస్తున్నామని, అలాగే అద్దెలకు ఉండే వారిని ఇళ్ల యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదని, ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచకూడదని తెలిపారు.

చదవండి: షాకింగ్: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కరోనా.. భయాందోళనలో వినియోగదారులు

అంతేకాదు, కేంద్రం ప్రకటించినప్పటికీ లాక్‌డౌన్‌లో ఎలాంటి మినహాయింపులు ఉండవని, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు లేదు…

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు లేవని, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. 

అయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఈ రోజు కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 858కి చేరిందని, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 21 మంది కరోనా వల్ల మరణించారని సీఎం చెప్పారు.

చదవండి: కరోనా అప్‌డేట్: గంట గంటకూ పెరుగుతున్న కేసులు.. 24 గంటల్లో 1,334.. మొత్తం కేసులు…

186 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 651 మంది ఆసుపత్రులలో చేరి చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. 

చాలా మందితో మాట్లాడా, అందరూ అదే చెప్పారు…

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేయాలా? లేకపోతే మరికొంత కాలం కొనసాగించాలా? అనే విషయమై తాను రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 100 మందితో మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. వారిలో వైద్యులు, న్యాయవాదులు, రైతులు, కూలీలు, యువకులు.. ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారన్నారు. 

వాళ్లలో చాలామంది ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ కొనసాగించాల్సిందేనని  చెప్పారని, దానికితోడు రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఎవరైనా ఒక్కటే, అన్ని మతాలూ సమానమే.. 

ఇకమీదట లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలవుతాయని,  రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైనా సామూహిక ప్రార్థనలకు అవకాశం లేదని, ఎవరి ఇళ్లలో వారే ప్రార్థన చేసుకోవాలని కేసీఆర్ తెలిపారు.

చదవండి: కరోనా వైరస్: పోలీసుల సేవలు ప్రశంసనీయం.. వారిపై సినిమా తీస్తా: దిల్‌ రాజు

హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఎవరైనా సరే అందరికీ ఒకటే నిబంధన అని సీఎం పేర్కొన్నారు. ఏ మతం వారైనా వారి  పండగలు, ప్రార్థనలు అన్నీ ఇళ్లలోనే చేసుకోవాలన్నారు. 

లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన దృష్ట్యా రాత్రివేళల్లో కర్ఫ్యూ ఇంతకుముందు మాదిరిగానే అమలు అవుతుందని, పరిస్థితిని బట్టి మళ్లీ మే 5వ తేదీన మళ్లీ మంత్రివర్గం సమావేశమై ఏం చేయాలన్నది నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. 

- Advertisement -