26.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఇంటర్ ఇష్యూ: నాలుగో రోజుకు లక్ష్మణ్ దీక్ష, తీవ్ర అస్వస్థత.. అయినా కొనసాగింపు…

ఇంటర్ ఇష్యూ: నాలుగో రోజుకు లక్ష్మణ్ దీక్ష, తీవ్ర అస్వస్థత.. అయినా కొనసాగింపు…

- Advertisement -

హైదరాబాద్: తాజాగా జరిగిన తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకల గురించి విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కొందరు విద్యార్ధులైతే పరీక్షల్లో ఫెయిలయ్యామన్న బాధ భరించలేక ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్ళిపోయారు.

ఈ నేపధ్యంలోనే ఇంటర్ విద్యార్ధులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.., వారికి న్యాయం జరగాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  ఏప్రిల్ 29 నుండి నిమ్స్‌లో నిరాహారదీక్ష చేపట్టారు.

గత నాలుగు రోజులుగా ఆయన ఎటువంటి ఆహారాన్నిగానీ, పానీయాలను గానీ తీసుకోకపోవడంతో అస్వస్థత చెందారు. లక్ష్మణ్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నట్టు.. ఆయన వ్యక్తిగత సిబ్బంది డాక్టర్లకు సమాచారం అందించారు.

అయితే లక్ష్మణ్ మాత్రం విద్యార్ధులకు న్యాయం జరిగే వరకూ నిరాహార దీక్ష విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకా దీక్ష కొనసాగిస్తే ఆయన ఇంకెంత అస్వస్థతకు లోనవుతారో అని లక్ష్మణ్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: కుర్రకుంక ఆయన్ని బపూన్ అంటున్నాడు! కేటీఆర్ పై రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి!

- Advertisement -