
ఢిల్లీ: ఏపీలో ఫణి తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాలో ఎన్నికల కోడ్ సవరించాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. అలాగే ఈరోజు ఆయన తుఫాను ప్రభావం వలన ఎక్కువ నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా అధికారులతో సచివాలయం నుంచి సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయిన తాను సహాయక చర్యలపై సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… మూడు వారాల్లో ఊడిపోయే పదవిపై చంద్రబాబుకు మమకారం తగ్గట్లేదని ఎద్దేవా చేశారు. ఇక పదవిలో ఉన్నంత కాలం దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, చంద్రబాబు పాలనలో రైతులు కరవుతో అల్లాడినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
తుఫాను పేరుతో డ్రామాలు చేస్తున్న చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అలాగే ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్టు భావిస్తున్నారని అన్నారు. అసలు ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు.
అయితే ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని , ప్రతి దాన్నీ రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబుకు టెన్షన్ తప్ప ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు.
చదవండి: యామినికి లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? వైసీపీ నేత సుధాకర్








