విషాదం: సరదాగా డ్యామ్ కి వెళ్లి.. నీట మునిగి.. ముగ్గురు విద్యార్ధులు మృతి

9:01 pm, Thu, 2 May 19
three-mba-students-from-pune-drown-in-mulshi-dam

పుణె: వేసవి రావడంతో సరదాగా విహారయాత్ర కోసం ముల్షి డ్యామ్‌కు వెళ్ళిన విద్యార్ధులు విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు.

వివరాల్లోకి వెళితే  భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీలో ఎంబీయే చదువుతున్న పది మంది విద్యార్ధులు పుణెకు 50 కి.మీ,ల దూరంలో ఉన్న ముల్షి డ్యామ్‌కు వెళ్లారు.

చావు రూపంలో ప్రళయం ముంచు కొస్తుందని తెలియక సరదాగా నీటిలోకి దిగారు. అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్న సమయంలో సంగీత నేగి (22), శివ్‌‌కుమార్ (22), శుభంరాజ్ సిన్హా (22) అనే ముగ్గురు విద్యార్ధులు నీట మునిగిపోయారు.

అక్కడే ఉన్న మిగతా విద్యార్ధులు వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఈలోపే విద్యార్ధుల కేకలు విని మునిగిపోయిన వారి కోసం స్థానికులు గాలించగా సంగీత శవంతో పాటు మరో యువకుడి శవం దొరికింది. ఇంకో యువకుడి మృతదేహం మాత్రం దొరకలేదు.

లభించిన మృత దేహాలను పోస్టుమార్టంకు పంపించి విచారణ చేపట్టిన పోలీసులు యువకులు ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారు కాగా.., సంగీత ఢిల్లీకి చెందినట్టు గుర్తించారు.

తమ బిడ్డల హఠాన్మరణం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆనందంగా గడపడానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని గుండె పగిలేలా ఏడుస్తున్నారు.

చదవండి:గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్…16 మంది జవాన్లు మృతి… తీవ్రంగా స్పందించిన మోడీ….