తెలంగాణ ఎన్నికల ఫలితాలు: దూసుకుపోయిన కారు.. ప్రజా కూటమికి షాక్!

kcr-mahakutami
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రజాకూటమి మధ్యనే పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎంఐఎం, బీజేపీలు కూడా ఈసారి తమ సీట్ల సంఖ్య పెరుగుతుందనే ఆశావాద దృక్పథంతో ఉన్నాయి.

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళి టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే భిన్నంగా రావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పార్టీల వారీగా ముందంజలో ఉన్న స్థానాలు.. గెలిచిన స్థానాల వివరాలు (సాయంత్రం 6:30 గంటల వరకు)

టీఆర్ఎస్ – 88 స్థానాల్లో గెలిచింది.
ప్రజాకూటమి – 21 స్థానాల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ – 19 స్థానాల్లో విజయం సాధించింది.
టీడీపీ – 2 స్థానాల్లో విజయం సాధించింది.
బీజేపీ
– 1 స్థానంలో విజయం సాధించింది.
ఎంఐఎం – 7 స్థానాల్లో విజయం సాధించింది.
ఇతరులు – 2 స్థానాల్లో విజయం సాధించారు.
టీజేఎస్ – ఒక్క సీటు కూడా రాలేదు.
సీపీఐ – ఒక్క సీటు కూడా రాలేదు.

కీలక స్థానాల్లో ఎవరి పరిస్థితి ఏంటి…

గజ్వేల్          – వంటేరు ప్రతాప్ రెడ్డి‌పై కేసీఆర్ విజయం సాధించారు.
కొడంగల్       – రేవంత్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
సిరిసిల్ల         – కేటీఆర్ విజయం సాధించారు.
సిద్ధిపేట        – హరీష్ రావు లక్షకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1,20,650 ఓట్ల తేడాతో హరీష్ రావు ఘన విజయం.
కూకట్‌పల్లి    – ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు.

డిసెంబర్ 11, 2018 ( మంగళవారం ):

07:30 PM –  కోదాడ ఫలితం చివరి వరకు ఉత్కంఠను రేపింది. ఇక్కడ ఈవీఎంలు మొరాయించడంతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి వీవీప్యాట్ ఓట్ల లెక్కింపునకు డిమాండ్ చేశారు. తీవ్ర ఉత్కంఠ నడుమ కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి 668 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి బరిలో నిలిచిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఓడిపోయారు.

07:20 PM –  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు. 800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

06:20 PM –  ఉత్కంఠగా మారిన కోదాడ నియోజకవర్గ ఎన్నికల ఫలితం, మూడు గ్రామాల ఈవీఎంలు మొరాయింపు, ప్రస్తుతం వెయ్య ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి, వీవీప్యాట్ స్లిప్‌ల ఆధారంగా కౌంటింగ్ జరపాలని కలెక్టర్ నిర్ణయం, మొత్తం ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి డిమాండ్, గంటపాటు నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు.

05:30 PM –  తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఫలితం.  రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యం. ప్రస్తుతం 100 ఓట్ల ఆధిక్యంలో మల్ రెడ్డి రంగారెడ్డి.

05:25 PM – కార్వాన్ నియోజకవర్గంలో విజయం సాధించిన ఎంఐఎం అభ్యర్థి.

05:15 PM – కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఓటమి.  ఆమెపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు 43 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

04:20 PM – ఆలేరులో గొంగిడి సునీత గెలుపు. జూబ్లీహిల్స్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం.

04:00 PM – గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 17,750 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెరాస అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్‌పై ఆయన  విజయం సాధించారు.

03:30 PM – తెలంగాణలో సంబరాల్లో మునిగితేలుతున్న టీఆర్ఎస్ శ్రేణులు, స్వీట్లు పంచుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.

03:10 PM – తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్.


02:55 PM – గజ్వెల్ నియోజకవర్గం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 51 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

02:50 PM – నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో  టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి గెలుపొందారు. భువనగిరిలో ఫైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధించారు.

02:45 PM – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

02:40 PM – తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని  కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది.

02:30 PM – కోదాడ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మవతి ఓటమిపాలయ్యారు.

02:25 PM – బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓటమి.  కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ ఓడిపోయారు.

02:20 PM – అంబర్ పేటలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఆయనపై 6 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి. ఇక కార్వాన్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

02:15 PM – ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో.. టీఆర్ఎస్ 41 స్థానాల్లో విజయం సాధించింది. మరో 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 3 స్థానాల్లో గెలుపొందగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  టీడీపీ 1 స్థానంలో విజయం సాధించగా మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందగా, మరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

02:10 PM – కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమి చవి చూశారు. బీజేపీ నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, రామచంద్ర రావులు ఓడిపోయారు.

02:00 PM – గజ్వేల్‌లో కేసీఆర్ విజయం. కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై 51, 500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత.

01:58 PM – ధర్మపురిలో నియోజకవర్గంలో 182 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు.  అయితే కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీవీప్యాట్‌లోని స్లిప్‌లు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొప్పుల విజయాన్ని ఈసీ ఇంకా నిర్ధారించలేదు.

01:55 PM – హుజారాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్  విజయం సాధించారు.

01:50 PM – ములుగులో మంత్రి చందూలాల్ ఓటమిపాలయ్యారు. ఇక్కడ 12,955 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు.

01:40 PM – సిరిసిల్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై గెలుపొందారు.

01:30 PM – కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై 9 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి.

01:25 PM – టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఆపద్ధర్మ మంత్రులూ ఓడిపోయారు.  కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా పని చేసిన తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఓటమిపాలయ్యారు. స్పీకర్ మధుసూదనా చారి కూడా ఓటమి దిశగా కొనసాగుతున్నారు.

01:20 PM – నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ ఓడిపోయారు.

01:15 PM – మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 18,391 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ ఆర్.కృష్ణయ్యపై టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు ముందంజలో కొనసాగుతున్నారు.

01:12 PM – ఖమ్మంలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 5, టీడీపీ 2, ఇతరులు 1, టీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

01:10 PM – గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఆధిక్యం 42 వేల పైచిలుకు ఓట్లకు చేరింది.  ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 74, కాంగ్రెస్ 18, టీడీపీ 2, బీజేపీ 2, ఎంఐఎం 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం 3 స్థానాల్లో గెలుపొందింది.

01:05 PM – పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వర్రావు ఓడిపోయారు.  ఇక్కడ ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఉపేందర్ 1950 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


01:03 PM – కేసీఆర్ గారి నాయకత్వంపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ట్వీట్.

01:00 PM – హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్‌పై 30 వేల ఓట్ల ఆధిక్యంతో తలసాని గెలుపొందారు.  అలాగే పటాన్‌చెరువులోనూ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.

12:50 PM – సిరిసిల్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ మెజారిటీ 60 వేల ఓట్లు దాటింది. అలాగే జనగామలో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి 18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఇక వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అధిక్యం కనిపిస్తోంది.  ఇక్కడ 534 ఓట్ల ఆధిక్యంలో స్వతంత్ర అభ్యర్థి కొనసాగుతున్నారు.

12:40 PM – నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఓడిపోయారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు.

12:35 PM – తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్  రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనిపిస్తోందని ఆరోపించారు. వీవీప్యాట్‌ల స్లిప్సులను కూడా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.

12:30 PM – గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ 38 వేల ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు.

12:10 PM – ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 1 స్థానం, ఎంఐఎం 2 స్థానాల్లో గెలుపొందాయి. ఇక టీఆర్ఎస్ 85 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, టీడీపీ 2, బీజేపీ 2, ఎంఐఎం 4, ఇతరులు 1 స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు.

12:00 PM – బీజేపీకి భారీ షాక్ తగిలింది. 5 నుంచి 1కి పడిపోయిన బీజేపీ ఆధిక్యం. గోషామహాల్‌లో బీజేపీ నేత రాజాసింగ్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు వెనుకంజలో పడ్డారు.

11:55 AM – సిద్ధిపేట నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి అయిన హరీష్ రావు వరుసగా రెండోసారి విజయం సాధించారు.  అయన 1,20,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  తెలంగాణ ఎన్నికల్లోనే ఇదొక రికార్డు.

11:50 AM – తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపిస్తోంది.  అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:45 AM – పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఓటమిపాలయ్యారు.

11:39 AM – జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. సిద్ధిపేటలో హరీష్ రావు విజయం సాధించారు. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ 52 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

11:25 AM – ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలిచారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ వెనుకంజలో పడ్డారు.

11:20 AM – హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉండగా, నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు.

11:10 AM – గద్వాలలో డీకే అరుణ, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.


11:00 AM – తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 87 స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.  దీంతో టీఆర్ఎస్ భవన్‌లో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి.

10:55 AM – యాకుత్‌పురాలో ఎంఐఎం ఆధిక్యంలో ఉండగా, కార్వాన్‌లో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోథ్‌ నియోజకవర్గలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  గజ్వేల్‌లో కేసీఆర్ 17 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:50 AM – టీఆర్ఎస్ 3 నియోజకవర్గాల్లో, ఎంఐఎం ఒక నియోజకవర్గంలో విజయం సాధించాయి.

10:49 AM – తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వరంగల్‌ వెస్ట్‌లో దాస్యం వినయ్‌ భాస్కర్‌, జగిత్యాలలో ఎం.సంజయ్‌ కుమార్‌, ముథోల్‌లో గడ్డం విఠల్ రెడ్డి, తుంగతుర్తిలో గాదరి కిషోర్‌ ఆధిక్యంలో ఉన్నారు. నిర్మల్‌లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:48 AM – దుబ్బాకలో టీఆర్ఎస్ 15 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. సూర్యాపేటలోనూ టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

10:47 AM – ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో ఉన్నారు. అంబర్ పేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 3,300 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ 9 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది.  ఇక మలక్‌పేట‌లో ఎంఐఎం పార్టీ 1000 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

10:45 AM – హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.  సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

10:39 AM – తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ని దీవించారని నిజామాబాద్ ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు.  మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పనితీరుకు ఇదొక రెఫరెండంగా భావించవచ్చని తెలిపారు.  ప్రజాకూటమి నేతలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు.  ఇక జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వంతు పాత్ర పోషిస్తారని ఆమె పేర్కొన్నారు.

10:38 AM – కుత్బుల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్ 5,200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొడంగల్‌లో టీఆర్ఎస్ 4,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక పరకాలలో  12 వేల ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో సాగుతున్నారు.

10:37 AM – కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. మలక్‌పేటలో ఎంఐఎం 1,000 ఓట్ల  ఆధిక్యంలో ఉంది.

10:36 AM – గజ్వేల్ నియోజకవర్గంలో మూడో రౌండులో కేసీఆర్ 9,211 ఓట్ల మెజార్టీతో వంటేరు ప్రతాప్ రెడ్డిపై ముందంజలో ఉన్నారు.  మరోవైపు మంత్రి మహేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.  చేవెళ్లలో టీఆర్ఎస్ 9 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది.

10:35 AM – చంద్రాయణగుట్ట స్థానంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ గెలిచారు.  జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలిచారు.  చెన్నూరులో బాల్క సుమన్ 5 వేల పైచిలుకు మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మిర్యాలగూడలో ఆర్.కృష్ణయ్య వెనుకంజలో ఉన్నారు.

 

- Advertisement -