హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ తిరిగి స్వీకరించాలంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద చేస్తున్న దీక్షను కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ హనుమంతరావు, షబ్బీర్ అలీ విరమింప జేశారు.
ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ…కాంగ్రెస్‌కు రాహుల్ నాయకత్వం అవసరమని అన్నారు. రాహుల్ రాజీనామా చేయకుండా.. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కోరారు.
1977లో ఇందిరా గాంధీ కూడా ఓడిపోయారని, ఈ ఎన్నికల్లో ఓటమికి కేవలం రాహుల్ మాత్రమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇక విభజన హామీలు సాధించే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై ఉందని వీహెచ్ అన్నారు. రాహుల్‌గాంధీని కలవడానికి అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ఒక ఆత్మ నడిపిస్తోందని, ఇలాంటి వారే రాహుల్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. రాహుల్ ఇలాంటి వారిని దూరం పెట్టాలని హితవు పలికారు.