28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ రాఖీ అంటే నాకు గుర్తొచ్చేది రాజన్నే: సబిత

రాఖీ అంటే నాకు గుర్తొచ్చేది రాజన్నే: సబిత

- Advertisement -

హైదరాబాద్: రక్షబంధన్ అనగానే తనకు తొలుత గుర్తొచ్చేది దివంగత సీఎం రాజశేఖరరెడ్డేనని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అన్ని పండుగల కంటే తనకు రాఖీ అంటే చాలా ఇష్టమని, రాజన్న ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదట రాఖీ తానే కట్టేదాన్నని గుర్తు చేసుకున్నారు.

రాజన్నకు కట్టిన తరువాతే తన సొంత తమ్ముడి దగ్గరకు వెళ్లేదాన్నని సబిత పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి తనను సొంత చెల్లెలుగా చూసుకునేవారంటూ ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మగా సంబోధించేవారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక హోంశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని నియమించారు.

- Advertisement -