
హైదరాబాద్: నిన్నటి తరం రేడియో అభిమానులు ‘చిన్నమ్మ’ను మర్చిపోలేరు. ‘పాడి-పంట’ కార్యక్రమంతో ఆబాలగోపాలన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) అనారోగ్యంతో కన్నుమూశారు.
చివరిసారి ఆమె ఈ నెల 8న ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేడియోలో ఆమె చేసింది వ్యవసాయ కార్యక్రమమే అయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ‘రేడియో చిన్నమ్మ’గా ప్రత్యేక గుర్తింపు సాధించారు.
పల్లెటూరి యాసతో ఆ కార్యక్రమానికే వన్నె తెచ్చారు. నిర్మలా వసంత్ మృతి విషయం తెలిసి ఆకాశవాణి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్‌కు చెందిన వసంత్‌ను వివాహం చేసుకున్న నిర్మలది అప్పటి తమిళనాడు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని కడప జిల్లాలో ఆమె కుటుంబం స్థిరపడింది.
వసంత్‌ను వివాహం చేసుకున్నాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమె భర్త వసంత్ నిజాం కాలేజీలో ఇంగ్లిష్ విభాగంలో డీన్‌గా పనిచేశారు. సంత్-నిర్మల దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.








