24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రికెట్ చివరి వన్డే: చాహల్ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

చివరి వన్డే: చాహల్ దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

- Advertisement -

మెల్‌బోర్న్: భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన యుజ్వేంద్ర చాహల్ కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు. పది ఓవర్లలో 42 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి దెబ్బకు ఆసీస్ టాపార్డర్ పేక మేడలా కుప్పకూలింది.

వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు బంతులు పడ్డాక మళ్లీ వర్షం మొదలు కావడంతో ఆట నిలిచిపోయింది. కాసేపటికి వర్షం తగ్గాక తిరిగి ఆట ప్రారంభమైంది. ఆసీస్‌ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి దెబ్బ కొట్టాడు. 8 పరుగుల వద్ద ఓపెనర్ అలెక్స్ కేరీ(5)ని భువీ పెవిలియన్ పంపాడు.

యుజ్వేంద్ర చాహల్ మాయాజాలం…

ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ అరోన్ ఫించ్‌‌ (14)ను భువనేశ్వర్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖావాజా (34), షాన్ మార్ష్ (39) కాసేపు పోరాటం చేసినప్పటికీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాయాజాలం ముందు నిలవలేకపోయారు. వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58) ఒక్కడే చాహల్‌ను కాసేపు ప్రతిఘటించాడు.

బౌలర్ల వీర విజృంభణతో ఆసీస్ 50 ఓవర్లు కూడా పూర్తిగా క్రీజులో నిలవలేకపోయింది. 48.4 ఓవర్లలో 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -