

హైదరాబాద్: కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషా మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. ఇదే విషయాన్ని అనీషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంది. విశాల్‌ను పెళ్లాడబోతున్నందుకు చాలామంది ఆమెకు అభినందనలు తెలిపారు.
చదవండి: పుకార్లకు ఫుల్‌స్టాప్: ‘అర్జున్ రెడ్డి’ నటితో హీరో విశాల్ పెళ్లి! త్వరలోనే నిశ్చితార్థం…
ఓ యువతి మాత్రం అనీషాపై విరుచుకుపడింది. ‘‘డబ్బుతో ఎవరినైనా కొనాలని అనుకుంటున్నందుకు సిగ్గులేదా నీకు? నీకున్న డబ్బుతో ఎవరినైనా ముష్టోడిని కొనుక్కోవచ్చుగా. విశాల్‌ను వదిలేసెయ్..’’ అంటూ తిట్టిపోసింది. ఆమె అంతగా మండిపడినా అనీషా మాత్రం చాలా కూల్‌గా సమాధానం ఇచ్చింది.
‘‘నా డబ్బు చూసే విశాల్ నన్ను పెళ్లాడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావంటే విశాల్‌పై నీకున్న గౌరవం ఏపాటిదో అర్థం అవుతోంది. జీవితంపై కొన్నిసార్లు నమ్మకముంచండి. ఎందుకంటే ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టేక్ కేర్..’’ అని చాలా హుందాగా సమాధానం ఇచ్చింది.
తనను ట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ చాలా కూల్‌గా, హుందాగా సమాధానం ఇచ్చిన అనీషాపై ఆమె ఫాలోవర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటువంటి చెత్త కామెంట్లు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.








