టీఆర్ఎస్ ఎన్నటికీ మోసం చేసి గెలవదు, మేమేంటో మా ప్రజలకు బాగా తెలుసు: ఎంపీ కవిత

nizamabad mp kavitha responce on evm tampering alegations
- Advertisement -

nizamabad mp kavitha responce on evm tampering alegations

హైదరాబాద్:  తెలంగాణ ఎన్నికల్లో తాము ఎటువంటి మోసం చేసి గెలవలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక  స్థానాలలో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ.. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై  ఎంపీ కవిత స్పందిస్తూ.. ‘‘ ఓడిపోయిన ఏ పార్టీ నేతలైనా.. సహజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపణలు చేస్తూవుంటారు. కానీ అది అబద్దం. మేము ఎలాంటి ట్యాంపరింగ్‌కి పాల్పడలేదు. అసలు ట్యాంపరింగ్‌కి అవకాశమే లేదని సీఈసీ.. నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. ప్రజలే టీఆర్ఎస్ పార్టీని దగ్గరుండి మరీ గెలిపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలన్నీ అబద్దాలే..’’ అంటూ పేర్కొన్నారు.

మా గురించి ప్రజలకు బాగా తెలుసు…

కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లాగా టీఆర్ఎస్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పారు. గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చూసే ప్రజలు తమను ఎన్నుకున్నారన్నారు. తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని ప్రజలకు బాగా తెలుసునని, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ తమవైపే ఉంటారన్న నమ్మకాన్ని కవిత వ్యక్తం చేశారు.

‘‘మాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేశాం. అందుకు బదులుగా ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. అది కూడా ఏకగ్రీవంగానే. ఈ విషయంలో మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మాపై, మా పాలనపై ఇతర పార్టీలు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేవు..’ అని వివరించారు కవిత.

- Advertisement -