26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home కరోనా వైరస్ ‘మై స్కూల్’ ఔదార్యం.. మోతీనగర్ జనప్రియ గేటెడ్ కమ్యూనిటీలో ‘కంప్లీట్ శానిటైజేషన్’…

‘మై స్కూల్’ ఔదార్యం.. మోతీనగర్ జనప్రియ గేటెడ్ కమ్యూనిటీలో ‘కంప్లీట్ శానిటైజేషన్’…

sanitisation-in-janapriya-metropolis-by-myschool
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ఇటు ప్రభుత్వాలు, అటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు శానిటైజేషన్ కార్యక్రమం కింద రసాయనాన్ని పిచికారీ చేసే కార్యక్రమాలను చేపడుతున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. 

చదవండి: రెండో విడత లాక్‌డౌన్.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ‘మై స్కూల్ – ఏ స్కూల్ విత్ కంప్లీట్ కేర్’ మోతీనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం  మోతీనగర్‌లోని అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ‘జనప్రియ మెట్రోపోలిస్ అండ్ క్లాసిక్ హోమ్స్’లో కంప్లీట్ శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. 

మెట్రోపోలిస్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఎంఎఫ్‌వోడబ్ల్యూఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహారావు, రవి శంకర్ తదితరుల సహకారం, అనుమతితో ఉదయం 8 గంటల నుంచి దాదాపు 3 గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా వైరస్‌ను చంపే రసాయనాన్ని పిచికారీ చేయించారు. 

sanitisation-in-janapriya-metropolis-by-myschool-1అభినందించిన ఎంఎఫ్‌వోడబ్ల్యూఏ…

ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ‘మై స్కూల్ – ఏ స్కూల్ విత్ కంప్లీట్ కేర్’ చొరవ చూపి.. సేవా భావంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం అని ఎంఎఫ్‌వోడబ్ల్యూఏ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రెసిడెంట్స్ అందరూ ఎవరి ఇళ్లలో వారు ఉండి కరోనా రక్కసిని ఎదుర్కొనడంతో తమ వంతు సహకారం అందించాలని కోరారు. 

చదవండి: పసిడి పరుగులే.. కొనాలంటే చుక్కలే! రూ.55,000కు చేరనున్న బంగారం ధర!?

ఈ కంప్లీట్ కమ్యూనిటీ శానిటైజేషన్ కార్యక్రమాన్ని ‘మై స్కూల్’ మోతీనగర్ బ్రాంచి ప్రతినిధులు.. రమేష్ రెడ్డి, అజేయ్, మహిమ, స్పందన, సునిల్ తదితరులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులోనూ తమ స్కూల్ తరుపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. 

 

- Advertisement -