తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్యే వనమా గుడ్‌బైై!

kothagudem-congress-mla-vanama-going-to-join-in-trs
- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌‌కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్‌‌కు బైబై చెప్పేశారు. త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ప్రజాభిప్రాయం ప్రకారమే తానీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
 
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయనతో భేటీ అనంతరం వనమా చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు తెలిపారు.

టీఆర్ఎస్‌లోకి క్యూలు…

మరోవైపు ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కూడా త్వరలో టీఆర్ఎస్‌ కండువా కప్పుకోబోతున్నారు. వైరా నుంచి కాంగ్రెస్ రెబల్‌గా గెలిచిన రాములు నాయక్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, ఇల్లెందు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన హరిప్రియా నాయక్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు.
 
1989లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు 1999, 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున విజయ దుందుభి మోగించారు. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన వనమా.. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో  వైద్య విధాన పరిషత్ మంత్రిగా పనిచేశారు.
- Advertisement -