- Advertisement -
హైదరాబాద్: తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని, చివరకు తన వాట్సప్ కాల్స్ కూడా ట్యాప్ చేయిస్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. కొన్ని రోజులుగా తనను కొన్ని షాడో టీమ్‌లు వెంబడిస్తున్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఇక్కడ కేవలం విపక్ష నాయకుల కార్లను మాత్రమే ఆపి సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
మహాకుాటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో మహాకూటమి పడిందనడం అవాస్తవమని కోదండరాం స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగుతుందని కోదండరాం చెప్పారు.
- Advertisement -