హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎడమ భుజానికి అయిన గాయానికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు మూడు కుట్లు వేశారు.
చదవండి: షాకింగ్: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…
జగన్‌ను 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి, బంధువులు ఉన్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు, నేతలు, హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో ఉన్న ఆయన నివాసానికి, చికిత్స జరుగుతున్న ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
జగన్‌ని పరామర్శించేందుకు వివిధ పార్టీల నాయకులు కూడా వస్తున్నారు. దీంతో పోలీసు అధికారులు జగన్ నివాసం దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.