
హైదరాబాద్: నేతల అరెస్టులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ ఎంపీ సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును అరెస్ట్ చేశారు.
బీజేపీ నేత లక్ష్మణ్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాంను ఇందిరాపార్క్ కూడలిలో అరెస్ట్ చేశారు.
బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్ వైపు ఆందోళనకారులు దూసుకెళ్తున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కార్మికులు కూడా పోలీసుల మీద రాళ్ల దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.








