23.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అభిమానులను అలరిస్తున్న బాలయ్య కొత్త లుక్

అభిమానులను అలరిస్తున్న బాలయ్య కొత్త లుక్

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌ తో అదరగొట్టేస్తున్నాడు. బాలయ్య తన 105వ చిత్రంలో గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు.

దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో రెండో సినిమా చేస్తున్న బాలయ్య ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. కేఎస్ రవికుమార్‌తో ఇప్పటికే ‘జైసింహా’ సినిమా చేసిన బాలకృష్ణ ఇప్పుడు ‘రూలర్’గా ముందుకొస్తున్నాడు.

ఫ్రెంచ్ గెడ్డంతో ఉన్న బాలయ్య లుక్‌ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. తాజాగా, ఈ రోజు మరో లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.ఇందులోనూ బాలకృష్ణ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది.

బాలయ్యను స్టైలిష్ లుక్‌లో చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఎక్స్‌లెంట్ మేకోవర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వచ్చే నెల 20న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

- Advertisement -