

ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ కేసు మరో మలుపు తిరిగింది. ఆయనను చంపింది రాకేశ్ రెడ్డేనని పోలీసులు తేల్చారు. కానీ, అసలు రాకేశ్ ఎవరో తమకు తెలియదని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు.
జయరామ్‌కు రాకేశ్ రూ.4.15 కోట్లు అప్పు ఇచ్చాడని, వాటిని వసూలు చేసుకునే క్రమంలోనే హత్య చేశాడని పోలీసులు చెప్పారు. కానీ, అన్ని కోట్లు అప్పు ఇచ్చే స్తోమత రాకేశ్‌కు లేదని అతని ఆర్థిక పరిస్థితి స్పష్టం చేస్తోంది. రాకేశ్‌ను ప్రధాన నిందితుడిగా, అతనికి సహకరించిన వాచ్‌మన్‌ను ఏ2గా చేర్చి ఏపీ పోలీసులు కేసు దర్యాప్తును ముగించారు.
తెలంగాణాకి కేసుని బదిలీ చేయాలనీ కోరిన జయరామ్ భార్య ..
కానీ, ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏమిటనేది బయటకు రావాలని, ఏపీ పోలీసులు జరిపిన దర్యాప్తు తనకు సంతృప్తికరంగా లేదని, కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు. వెరసి, జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరామ్ హత్య కేసులో మిస్టరీ వీడిపోయిందని పోలీసులు చెప్పారు.
ఊహించినట్లుగానే ఈ కేసులో రాకేశ్ రెడ్డే ప్రధాన నిందితుడని తేల్చారు. అతడికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివా్‌సను ఏ2గా చేర్చారు. ఆది నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు. కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. తన తండ్రి పిచ్చయ్యతో పాటు తన లాయర్ ను వెంట తీసుకుని హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పద్మశ్రీ ఫిర్యాదు చేశారు.
సంబంధిత వార్తలు : ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి: చిగురుపాటి జయరామ్ హత్య కేసుపై ఎస్పీ, పూర్తి వివరాలివే…
జయరామ్ మృతి : హత్య తరువాత పోలీసుల సాయం! రాకేష్ రెడ్డి వెల్లడి! ఆ ఇద్దరు
జయరామ్ మృతి : శిఖా చౌదరి అరెస్ట్ అయ్యే అవకాశం !








