28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జనసేనానికి ఊహించని ఆఫర్! జగన్ పై పోటీకి సిద్ధమన్న కేఏ పాల్!

జనసేనానికి ఊహించని ఆఫర్! జగన్ పై పోటీకి సిద్ధమన్న కేఏ పాల్!

pavan kalyan vs ka paul
- Advertisement -

pavan kalyan vs ka paul

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీతో కలిసి రావాలని ఆయన పవన్‌కు సూచించారు. మెజార్టీ స్థానాల్లో పవన్ పార్టీ పోటీ చేసే అవకాశం కల్పిస్తానని పాల్ తెలిపారు.

జగన్‌పై పోటీకి సిద్ధం…

జనసేన మద్దతు పలికితే తాను సీఎం అవుతాననే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఐదు శాతానికి మించి ఓట్లు రావని పాల్ జోస్యం చెప్పారు. కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తానని చెప్పిన పాల్, పులివెందుల నుంచి జగన్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలు అవినీతికి మారుపేరుగా తయారయ్యాయని కేఏ పాల్ వాపోయారు. వచ్చే ఎన్నికల్లో ఏపీతోపాటు తెలంగాణలో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని విమర్శించిన పాల్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరింతగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.

అక్రమంగా లక్షల కోట్లు సంపాదించిన జగన్ జైలుకు వెళ్లి వచ్చాడని పాల్ ఆరోపించారు.
సీఎం చంద్రబాబు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారని కేఏ పాల్ విమర్శించారు. అవినీతిపరులైన వారిద్దర్నీ ప్రజలు నమ్మరని చెప్పారు.

చదవండి : జనసేనలోకి కేవీ విష్ణురాజు: కీలక పదవి అప్పగించిన పవన్ కళ్యాణ్

- Advertisement -