

ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌తో ప్రారంభమైన టీమిండియా జైత్రయాత్ర మూడు నెలల సుదీర్ఘ విదేశీ పర్యటన అనంతరం న్యూజిలాండ్ తో టి20 సిరీస్ ద్వారా ముగియనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతితో సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ మెరవాల్సి ఉంటుంది.
వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నాడు. గాయం, సస్పెన్షన్‌తో కొన్నాళ్లుగా అంతర్జాతీయ టి20లు ఆడని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం కానుంది.
ఓపెనర్లు రోహిత్, ధావన్ తర్వాత యువ శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో వస్తాడు. అంచనాల ప్రకారం చూస్తే జట్టులో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోని రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లూ ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములు కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ల కోటాను భర్తీ చేయనున్నారు.
అలాగే ఆతిథ్య జట్టు డాషింగ్ ఓపెనర్ గప్టిల్, ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ లేకుండానే ఆడనుంది. మున్రోతో పాటు కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. వన్డేల్లో విఫలమైన విలియమ్సన్ రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్ భారం మళ్లీ రాస్ టేలర్‌దే. మరికొద్దిసేపట్లోనే వెల్లింగ్టన్‌లో తొలి టి 20 మొదలుకాబోతుంది.
చదవండి : మొదటిసారిగా కలిసి బరిలోకి దిగబోతున్న పాండ్యా బ్రదర్స్! వారి సరసన చోటు…








