

హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, తాను మాట్లాడుకున్నామని జగ్గారెడ్డి అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్ఎస్ నుంచేనని చెప్పారు.
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉందని.. అదే విషయంపై అసెంబ్లీలో తాను అడగ్గానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని జగ్గారెడ్డి చెప్పారు.
కేసీర్‌ను సన్మానిస్తా, ఏపీలో టీడీపీదే విజయం: జగ్గారెడ్డి
కాలేజీ ఏర్పాటుపై జీవో వెలువడిన తర్వాత కేసీఆర్‌ను కలుస్తానని అన్నారు. అంతేగాక, సంగారెడ్డికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించి ఘనంగా సన్మానిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. మెదక్ నుంచి రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు తలపడితే… రాహుల్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.
సంబంధిత వార్తలు
నా అవసరం, కేసీఆర్‌కు సన్మానం చేస్తా: జగ్గారెడ్డి సంచలనం








