26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ లాక్‌డౌన్ ఆంక్షలు: సడలింపా? కొనసాగింపా? ప్రగతిభవన్‌లో టీఎస్ క్యాబినెట్ భేటీ ప్రారంభం…

లాక్‌డౌన్ ఆంక్షలు: సడలింపా? కొనసాగింపా? ప్రగతిభవన్‌లో టీఎస్ క్యాబినెట్ భేటీ ప్రారంభం…

cm-kcr-telangana-cabinet-meeting
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలను సోమవారం (ఏప్రిల్ 20) నుంచి సడలిస్తారా? లేదంటే కరోనా కేసులు మరింత పెరుగుతోన్న నేపథ్యంలో ఈ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తారా? ఇదీ ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం మదిలో మెదులుతోన్న ప్రశ్న. దీనికి సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే చెప్పగలరు. 

చదవండి: లాక్‌డౌన్‌లో అన్నీ ఫ్రీగా ఇవ్వండి: సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్

ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 14న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు.

ఆంక్షలు సడలిస్తారా? లేదా?

ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్క రెడ్ జోన్ మినహా.. రాష్ట్రంలోని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుంచి ఆంక్షల సడలింపులు ఉంటాయా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పరేషన్ పరిధిలో కోవిడ్19 పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 803 కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు, ఈనెల 25 నుంచి రంజాన్ పవిత్ర మాసం కూడా ప్రారంభం కానుంది.

మరి రంజాన్ మాసం అనగానే.. మత ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఉంటాయి. అయితే వీటి సందర్భంగా జనం గుమిగూడితే కరోనా మరింత పేట్రేగిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం ముస్లిం మతపెద్దల సహకారం కూడా తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.  

తెలంగాణ మంత్రివర్గ భేటీ ప్రారంభం…

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు, రాజధాని హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు తదితర అంశాల నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపుపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం కూడా ప్రారంభం కానుండడంతో దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.  

ఇతర అంశాలపైనా చర్చ…

అంతేకాకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలకు సంబంధించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

ముఖ్యంగా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపునకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలా? లేకపోతే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక నిబంధనలు ఏమైనా రూపొందించాలా? అనేది కేబినెట్ భేటీలో కీలకంగా మారింది.  మంత్రివర్గ సమావేం అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు. 

- Advertisement -