
హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వందలాదిమంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
తిండీ తిప్పలు లేకుండా ఇక్కడ ఉండలేమని, వెంటనే తమను సొంతూళ్లకు పంపించాలంటూ ఆందోళనకు దిగారు. అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేసి బీభత్సం సృష్టించారు.
చదవండి: వామ్మో.. ఇదే ఐసోలేషన్ సెంటర్? సరైన తిండీ లేదు, శుభ్రత అంతకన్నా.. 70 ఏళ్ల వృద్ధుడు పరార్!
ఐఐటీ హైదరాబాద్ భవన నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్ కారణంగా నగరంలో చిక్కుకుపోయారు.
కంది ఐఐటీ వద్ద…
సంగారెడ్డిలోని కంది ఐఐటీ వద్దే ఉన్న వీరంతా నిన్న స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమై ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కార్మికులు రాళ్లు, కర్రలతో దాడిచేశారు.
ఈ ఘటనలో పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను మోహరించడంతో కార్మికులు వెనక్కి తగ్గారు.
సామాజిక దూరం పాటించాలని ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు అదేమీ పట్టించుకోకుండా ఆందోళనకు దిగడం పోలీసులను కలవరపాటుకు గురిచేసింది.
చదవండి: ఆ నేర్పు మీకుందేమో కానీ.. తిండి లేక అల్లాడుతున్న పేదలకు లేదు: జగన్‌పై అచ్చెన్నాయుడు…
సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీ చంద్రశేఖర్‌లు కార్మికులతో సమావేశమై సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
నేటి సాయంత్రానికి వారికి రావాల్సిన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఆందోళనకు దిగి పోలీసుల వాహనాలను ధ్వంసం చేసిన వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.








