22.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ నీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగేశాడు: చివరకు..

నీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగేశాడు: చివరకు..

alcohol
- Advertisement -

alcohol

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచినీళ్లనుకుని ప్లాస్టిక్‌ సీసాలో ఉన్న యాసిడ్‌ను మద్యంతో కలిపి తాగడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. జనవరి 27న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావు తెలిపిన కథనం ప్రకారం… చాంద్రాయణగుట్ట కుమ్మరివాడిలో నివసించే గణ్‌పతిస్వామి రెండో కుమారుడు విజయ్‌కుమార్‌ స్వామి(26) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు‌. కాగా, జనవరి 27న ఆదివారం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్‌కుమార్‌ మిద్దెపైకి వెళ్లాడు.

నీళ్లనుకుని యాసిడ్ కలుపుకుని మద్యం తాగేశాడు

అక్కడ బాత్‌రూం కిటికీ గోడపై ఉంచిన ప్లాస్టిక్‌ బాటిల్‌ను నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలిపి తాగాడు. తాగిన కొద్దిసేపటికి అది యాసిడ్‌ అని గుర్తించాడు. అప్పటికే గొంతులో మంటగా ఉండడంతో కేకలు వేశాడు.

వెంటనే కుటుంబసభ్యులు అతని వద్దకు చేరుకున్నారు. అతని తండ్రి గణ్‌పతిస్వామి స్థానికుల సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విజయ్‌ సోమవారం రాత్రి ప్రాణాలు వదిలాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -