32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బాబు సర్కారుకు షాక్: చుక్కల భూమి ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన గవర్నర్

బాబు సర్కారుకు షాక్: చుక్కల భూమి ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన గవర్నర్

babu-governor
- Advertisement -

babu-governor

అమరావతి‌: మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ నర్సింహన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తెచ్చిన చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నర్సింహను బుధవారం తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిరస్కరించారు.

అంతేగాక, 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్‌ తప్పుబట్టారు. కేవలం అసైన్‌మెంట్‌ ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఏపీ అసైన్‌మెంట్‌ ల్యాండ్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్‌ 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఎవరికీ అమ్ముకోకుండా ఉండే నిబంధనకు అంగీకారం తెలిపారు.

ఆమోదం తెలపకపోవడమేంటి: ప్రభుత్వ వర్గాల్లో చర్చ

చుక్కల భూములపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు ఆస్కారం లేదనే అభిప్రాయం గవర్నర్‌ వ్యక్తంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే మరో ఆర్డినెన్స్‌కు ఎలా ఆమోదం తెలిపారనే చర్చ ప్రభుత్వవర్గాల్లో నడుస్తోంది.

అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ దస్త్రం అసెంబ్లీ నోటిఫికేషన్‌కు ముందు వచ్చిందని, చుక్కల భూముల దస్త్రం అసెంబ్లీ షెడ్యూల్‌ వెలువడ్డాక వచ్చిందన్నది గవర్నర్‌ కార్యాలయ వర్గాల భావనగా తెలుస్తోంది. చుక్కల భూముల బిల్లుకు సంబంధించి గవర్నర్‌ ఆమోదంతో సంబంధం లేకుండా నేరుగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -