- Advertisement -
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసి, గొప్ప అనుభూతిని పొందాను అంటు తెలియజేశారు. శుక్రవారం ఉదయం గద్దర్‌తోపాటు ఆయన సతీమణి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
70 ఏళ్ల జీవిత కాలంలో తొలిసారిగా…
ప్రజా గాయకుడు గద్దర్ తన 70 ఏళ్ల జీవిత కాలంలో తొలిసారి ఓటు వేశారు. సికింద్రాబాద్ ఆల్వాల్ పరిధిలోని భూదేవినగర్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు అనేది రాజకీయ పోరాట రూపమని, ఓట్ల యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓట్ల విప్లవం ఎప్పటికీ వర్ధిల్లాలని వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు.
- Advertisement -