కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు భారీ పెట్టుబడులు! 10 శాతం వాటా కొనుగోలుకు వారెన్ బఫెట్ యత్నం?

kotak mahindra bank surges over report berkshire investment
- Advertisement -

kotak mahindra bank surges over report berkshire investment

ముంబై : ప్రైవేటు రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌‌కు జాక్‌ పాట్‌ తగిలింది. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్‌ ​ఇన్వెస్టర్‌ వారెన్ బఫెట్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌‌లో భారీస్థాయి పెట్టుబడులకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 శాతం వాటాను ఆయన కొనుగోలు చేయనున్నారన్న వార్తలు శుక్రవారం స్టాక్ మార్కెట్‌‌లో సంచలనం సృష్టించాయి.

400-600 కోట్ల డాలర్ల పెట్టుబడులు…

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో అమెరికన్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హ్యాత్ వే 4-6 బిలియన్‌ డాలర్లను అంటే దాదాపు 28,000-42,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. బ్యాంకులో 10 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమోటర్‌ వాటా నుంచి లేదా ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ కింద వాటాను సొంతం చేసుకోనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులో ప్రస్తుతం ఉదయ్‌ కొటక్‌కు 29.73 శాతం వాటా ఉండగా.. మొత్తం ప్రమోటర్‌ గ్రూప్‌నకు 30.02 శాతం వాటా ఉంది.

కొటక్‌ మహీంద్రా యాజమాన్యం వివరణ..

అయితే  గ్లోబల్‌ ​ఇన్వెస్టర్‌ వారెన్ బఫెట్‌ పెట్టుబడి వార్తలను కొటక్‌ మహీంద్రా యాజమాన్యం కొట్టిపారేసింది. దీనికి సంబంధించి నివేదించడానికి త​మ వద్ద సమాచారం ఏమీ లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

మరోవైపు వారెన్‌ బఫెట్‌ కొనుగోలు వార్తలతో శుక్రవారం ఇన్వెస్టర్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో దాదాపు 10 శాతం జంప్‌ చేసిన బ్యాంక్ షేరు, ఆ తరువాత కంపెనీ వివరణ అనంతరం 7 శాతం లాభాలకు పరిమితమైంది.

- Advertisement -