26.7 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఇంటర్‌లో ఫెయిల్! తెలంగాణలో వరుస ఆత్మహత్యలు!

ఇంటర్‌లో ఫెయిల్! తెలంగాణలో వరుస ఆత్మహత్యలు!

inter faild students sucides at telangana
- Advertisement -

తెలంగాణ: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుులు తిడతారని ఒకరు..స్నేహితుల వద్ద తలెత్తుకులేమని ఇంకొకరు, సమాజంలో పరువు పోతుంది మరొకరు.

ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. చలకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు.

కానీ ఇదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగలుత్చుతున్నారు.తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భావి పౌరులు జీవితం మధ్యలోనే తనువు చాలిస్తున్నారని.

విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. ఫెయిలైన విద్యార్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలని, తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ లోకి వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.

మేడ్చల్‌లో నవ్యశ్రీ అనే యువతి ఉరి,
మారేడ్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని లాస్య ఆత్మహత్య,
ఏఎస్‌రావ్ నగర్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య,
హైదరాబాద్‌లో కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక సూసైడ్,
వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న భాను కిరణ్,
బోధన్‌లో ఇంటర్ విద్యార్థిని వెన్నెల ఆత్మహత్య.

- Advertisement -