
హైదరాబాద్: ఈ నెలలో మూడు దశల్లో తెలంగాణలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి. అయితే జూన్ 4 కంటే ముందే ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా..నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వాటి లెక్కింపు జూన్ 3న ఉన్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ 4న చేపట్టనున్నారు.
ఈ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ఉదయం 8గంటల నుంచి ఓట్లను లెక్కించి..అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
అయితే జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. మరోవైపు ప్రమాణస్వీకారానికి ఎక్కువ సమయం ఉండటంతో…. ఎన్నికల సంఘం అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేసింది.
దీని ద్వారా ఫలితాలు వెలువడగానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది.
చదవండి: చంద్రబాబుపై సానుభూతి చూపించిన నాగబాబు…








