
కార్డిఫ్: ప్రపంచ కప్ సమరానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. మొదటి వార్మప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన కోహ్లీ సేన….రెండో మ్యాచ్‌లో మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జట్టుని చిత్తుగా ఓడించింది.
కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 359/7 స్కోరు చేసింది.
ధోనీ(78 బంతుల్లో 113, 8ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్(99 బంతుల్లో 108, 12 ఫోర్లు, 4సిక్స్‌లు) సెంచరీలతో దుమ్ములేపారు. ఇక కెప్టెన్ కోహ్లీ (47), హర్ధిక్ పాండ్యా(21) పరుగులతో రాణించారు.
అనతరం 360 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్ బాగానే పోరాడారు. ముష్ఫీకర్ రహీమ్(90), లిట్టన్ దాస్(73) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం….భారత్ యువ స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు చెరో 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీయడంతో బంగ్లా 264 పరుగులకి ఆలౌట్ అయింది.
ఇక వరల్డ్ కప్‌లో భాగంగా మొదటి మ్యాచ్ రేపు ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. అలాగే భారత్ తన తొలి మ్యాచ్ జూన్5న దక్షిణాఫ్రికాతోనే పోటీ పడుతుంది.
చదవండి: భారత్ ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలకం అవుతాడు….








