23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ హిందూపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

హిందూపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balayya Latest News, NTR Jayanthi News, AP Latest News, Newsxpressonline
- Advertisement -

హిందుపూర్: నేడు మాజీ సీఎం , టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ జయంతి.ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు.
ఆ తరువాత ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచం నలుమూలల చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని , పార్టీని స్థాపించిన 9నెలల్లోనే అధికారం లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని పెంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన సినిమాల్లో నటిస్తూ ప్రజా సేవకై పార్టీ స్థాపించి పరిపాలన అంటే ఇలా ఉండాలని చూపించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మరోసారి రుజువు చేశారన్నారు.

గతంకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి మరింత చేయడానికి నాకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీఇచ్చారు. తెలుగు గంగ ద్వారా సీమకు నీరు తెచ్చిన భగిరితుడు ఎన్టీఆర్, ఎక్కడరా పట్టిసీమ నుంచి ఎడారిగా మారిన అనంతపురం జిల్లాకు నీటి తీసుకొచ్చి చెరువులు నింపి సస్యశ్యామలం చేసిన అభినవ భగిరథుడు చంద్రబాబు అని చెప్పారు.

ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన వైసిపికి ఓటు వేయడం బాధ కలిగిస్తుందన్నారు అయినా ఈ ఐదేళ్లలో కార్యకర్తలకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలం అని , దేశంలో ఏ పార్టీకి లేనివిదంగా టిడిపి కార్యకర్తలు ఉన్నారన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్.అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే రంగనాయుకులు,మునిసిపల్ చైర్మన్,లక్ష్మి, తదితరులు హాజరయ్యారు.

చదవండి:  ఇకపై తాత భాద్యత నాదే: ఎన్టీఆర్
- Advertisement -