
- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల మొదట్లో తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి.
నేడు ఒక్కరోజే 40 కరోనా నిర్ధారిత కేసులు నమోదయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన 40 కేసుల్లో 33 జీహెచ్‌ఎంసీ పరిధిలోవేనని తెలిపింది.
రాష్ట్రంలో నేడు ఏడుగురు వలస కూలీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1454కి చేరాయి.
కరోనా నుంచి కోలుకుని శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 959 మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.
రాష్ట్రంలో ప్రస్తుతం 461 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలగే, ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు.
- Advertisement -








