
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. నేడు ఏకంగా 143 కేసులు నమోదయ్యాయి. అలాగే, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్ 5.0 ప్రకటించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చిన తర్వాత కేసులు సంఖ్య వేగంగా పెరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతానికిపైగా ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,290కి పెరిగింది.
మరోవైపు, జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,138కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 113 మంది కరోనా కాటుకు బలయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,627 మంది డిశ్చార్జ్ కాగా 1,550 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డి- 08, మహబూబ్‌నగర్- 05, వరంగల్- 03, ఖమ్మం- 02, ఆదిలాబాద్- 02, మేడ్చల్ – 02, సంగారెడ్డి- 02, కరీంనగర్ – 02, సంగారెడ్డిలో ఒక కేసు నమోదయ్యాయి.








