
- Advertisement -
అలబామా: అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. అలబామా రాష్ట్రంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. మౌంటీ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది.
అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఏడుగురు విగతజీవులుగా పడి ఉన్నారు.
అలాగే, ఇంట్లోని వస్తువులు మంటల్లో తగలబడతుండడంతో వాటిని ఆర్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ కాల్పుల ఘటనకు ఎవరు కారణమన్నది ఇంకా తెలియరాలేదని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
- Advertisement -








