25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అందరి ముందు చెప్పుతో అధికారి చెంప పగలగొట్టిన బీజేపీ నేత.. వీడియో చూడండి!

అందరి ముందు చెప్పుతో అధికారి చెంప పగలగొట్టిన బీజేపీ నేత.. వీడియో చూడండి!

- Advertisement -

హర్యానా: టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫొగట్  వివాదంలో చిక్కుకున్నారు. హిసార్ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్‌ సింగ్‌పై మీడియా ఎదుటే చెప్పుతో దాడిచేశారు. అంతేకాదు, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు తమాషా చూస్తుండడం గమనార్హం.

శుక్రవారం బల్సామంద్ మండిలో సోనాలి పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. 

మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్‌ సింగ్‌ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో పరిశీలనకు వెళ్లిన ఫొగట్ ఆయనపై చెప్పుతో దాడిచేశారు. 

ఫొగట్ తనపై దాడిచేసిందంటూ సుల్తాన్ సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫొగట్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. 

సుల్తాన్ సింగ్ మాట్లాడుతూ..  హిసార్‌లోని తన కార్యాలయానికి వచ్చిన సోనాలి.. పప్పు ధాన్యాల సేకరణ ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారని, దానికి తాను మండిలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల సేకరించలేదని చెప్పానని తెలిపారు.

 పావు గంట మాట్లాడిన తర్వాత ఆమె తనను కొట్టడం ప్రారంభించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వలేదని కూడా ఆరోపణలు చేసిందని అన్నారు.

తాను మీ నియోజకవర్గానికి చెందిన వాడిని కాదని చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదని సుల్తాన్ సింగ్ తెలిపారు.

కాగా, గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్‌ నుంచి పోటీ చేసిన సోనాలి ఫొగట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

- Advertisement -