- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 6,270 తేడాతో విజయం సాధించారు.
అటు నల్గొండలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు విజయం సాధించారు.
ఇక 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉండగా…ఒక స్థానంలో ఎంఐఎం పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే 17 స్థానాల్లో16 స్థానాలు మావే అని ముందు నుంచి చెబుతున్న టీఆర్ఎస్‌కి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ పార్టీ ప్రస్తుతం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా….4 స్థానాల్లో గెలుపొందినట్లు తెలుస్తోంది.
- Advertisement -








