
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ….విజయాల బాట పట్టింది. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా…14 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి గాను 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…రాజంపేట నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించారు.
ఇక టీడీపీ 24 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…1 పార్లమెంట్ స్థానంల్ లీడ్ లో ఉంది. జనసేన 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఏపీలోని అన్నీ జిల్లాలో వైసీపీ ఆధిక్యం కొనసాగిస్తుంది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు తిరుపతి వేదికగా మారనుంది. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు.
వైసీపీ నాయకులు .. కార్యకర్తలు .. అభిమానుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ముందుగా ఆయన తిరుమల కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు.








